సామాన్యుల కోసం.. బజాజ్ కారు వచ్చేస్తోంది..

గతంలో నానో కారుకు మార్కెట్‌లో ఎంత క్రేజ్ వచ్చిందో అందరికి తెలుసు. తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఆ కారు భారత వాహన రంగంలో సంచలనం సృష్టించింది. తాజాగా మరో వాహనం రోడ్లపైకి వచ్చేస్తోంది. బజాజ్ ఆటో ‘క్యూటీ’ పేరుతో క్వాడ్రిక్ సైకిల్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీని ధర రూ.2.60 లక్షల నుంచి రూ.3లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఇది అధిక మైలేజీతో పాటు కాలుష్యానికి ఎలాంటి హానీ కలిగించదట.

rtr

ఇది గంటలకు 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నగరాల్లో ప్రయాణానికి సరిపోతుంది. క్యూటీని వాణిజ్య అవసరాలకు మాత్రమే అమ్మాకాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా వ్యక్తిగత అవకాశాలకు దీన్ని వినియోగించుకోవచ్చంటూ నిబంధనలను సడలించింది. అయితే వ్యక్తిగత ప్రయాణ వాహన రంగంలో మార్పు చోటు చేసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ..‘పట్టణాల్లో ప్రయాణాలకు క్యూటీ మంచిగా పనిచేస్తుంది. ద్విచక్రవాహనంతో పోలిస్తే, భద్రత విషయంలోనూ మంచి ప్రమాణాలను పాటించాం. దీన్ని తయారు చేయడానికి టూవీలర్కు అయ్యేంతా ఖర్చు అయ్యింది. ఇది అధిక మైలేజీని ఇవ్వడంతో పాటు, కాలుష్య ఉద్గారాలను సైతం తక్కువగా వెలువరిస్తుంది. అని పేర్కొన్నారు. అయితే ఇది ఇంకా మన దేశంలో విడుదల చేయలేదు. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే రాజీవ్ బజాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిన్ ఇండియా అంటారు కానీ, ఏమైనా ఆవిష్కరిస్తే అనుమతులు ఇవ్వరు అందుకే మ్యాడ్ ఇన్ ఇండియా అనాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. వీటి అమ్మాకాలు యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో జోరుగా జరుగుతున్నా.. మన దేశంలో మాత్రం కొన్ని కారణాల వల్ల ఇంకా అనుమతులు రాలేదు.