ప్రపంచమంతా ప్రేమికుల రోజును జరుపుకుంటుంది. ఈ క్రమంలో ప్రేమికుల రోజు పాశ్చాత్య సంస్కృతి అనీ, దాన్ని జరుపుకోవద్దని వీహెచ్పీ, భజరంగ్ దళ్ హిందూ సంఘాలు ప్రకటించాయి. ప్రేమికుల రోజు సందర్భంగా పార్కుల్లో కనిపిస్తే పెళ్లి చేసేస్తామని హెచ్చరించాయి. తాజాగా ఈరోజు మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో ఓ ప్రేమ జంటకు భజరంగ్ దళ్ సభ్యులు పెళ్లి చేశారు.
పార్కులో ఉన్న ప్రేమ జంటను చుట్టుముట్టిన సభ్యులు యువకుడి చేత యువతికి తాళి కట్టించారు. ఈరోజు చాలా మంచిదనీ, ఆమెకు తాళి కట్టాలని సూచించారు. దీంతో సదరు యువకుడు భయపడుతూ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఈ తతంగాన్ని అంతా భజరంగ్ దళ్ సభ్యులు వీడియో తీసారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పార్కుల వద్ద పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
Telugu News Bajrang dal members forced lovers to get married in Hyderabad