అదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ - MicTv.in - Telugu News
mictv telugu

అదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ

October 25, 2017

బాలకృష్ణ కథానాయకుడుగా నటించిన ‘ఆదిత్య 369’  చిత్రం గుర్తుందా? బాలయ్య, మోహిని, సుత్తివేలు..  టైమ్ మిషిన్‌లో  శ్రీకృష్ణ దేవరాయల కాలానికి వెళ్లడం, అక్కడ జరిగే తమాషాలు అందర్నీ అలరిస్తాయి. 1991లో వచ్చిన ఈ  చిత్రానికి సీక్వెల్  సిద్దమవుతున్నది.  ఈ చిత్రం ద్వారా బాలకృష్ఱ తనయుడు మోక్షజ్ఞ తెలుగు తెరకు పరిచయం  కానున్నాడు.  ఈ విషయాన్ని ఆదిత్య 369 చిత్రానికి దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాస్ రావు ఓ జాతీయ ఆంగ్ల పత్రీకకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆదిత్య 369 సీక్వెల్ కు కథ సిద్ధం అవుతోందని , మోక్షజ్ఞతో తెరకెక్కించాలనుకుంటున్నానని తెలిపారు.

కానీ బాలకృష్ణ నుంచి ఇంకా  అనుమతి రాలేదని వెల్లడించారు. ‘మోక్షజ్ఞ  కథానాయకుడిగా నటిస్తాడు.  బాలకృష్ణకు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర ఉంటుంది. బాలకృష్ణ ఓకే చెప్పితే ఈ చిత్రం సైట్స్ పైకి వెళ్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఈ చిత్రం సైట్స్ పైకి వెళితే   తండ్రికొడులకు ఒకే  తెర మీద కనిపించడం నందమారి అభిమానులకు పండుగే అని చెప్పుకోవాలి.