ఆసుపత్రి నుండి బాలకృష్ణ డిశ్చార్జ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆసుపత్రి నుండి బాలకృష్ణ డిశ్చార్జ్

February 5, 2018

కాంటినెంటల్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకుంటున్న బాలయ్య సోమవారం ఉదయం డిశ్చర్జ్ అయ్యారు.

రొటేటర్‌ కప్‌ టియర్స్‌ ఆఫ్‌ షోల్డర్‌ సమస్యతో బాధపడుతున్న బాలకృష్ణకు..శనివారం ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డా.దీప్తి నందన్‌ రెడ్డి, డా.ఆశిష్‌ బాబుల్కర్‌ కుడి భుజానికి శస్త్రచికిత్స చేశారు. చికిత్స సక్సెస్ అవడంతో డిశ్చర్జ్ అయ్యారు. ఆరు వారాల వరకు ఎలాంటి షూటింగ్‌లలో పాల్గొనకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వచ్చేవారం మరోసారి వైద్య పరీక్షలకు రావాల్సిందిగా చెప్పారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సందర్భంగా తనకు చికిత్స చేసిన వైద్యుడితో బాలకృష్ణ ఫొటో దిగారు.ప్రస్తుతం బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నటిస్తున్నాడు. విశ్రాంతి అనంతరం ఈ సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ పాల్గొననున్నట్టు సమాచారం.