పీక్స్‌కు చేరిన బాలయ్య కోపం…ఈసారి ఫ్యాన్స్‌ను తన్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

పీక్స్‌కు చేరిన బాలయ్య కోపం…ఈసారి ఫ్యాన్స్‌ను తన్నాడు

October 2, 2018

అభిమానులు, హీరోలను తమ ప్రాణంగా అభిమానిస్తుంటారు. సినిమా విడుదల అయిందంటే వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. తమ సొంత పనులు విడిచిపెట్టుకుని సినిమా హిట్టవ్వాలని తెగ ప్రయత్నిస్తుంటారు. అంతచేస్తున్న అభిమానులకు హీరోలు ఇంకెంత చెయ్యాలి ? వారి అభిమానానికి వీరి ప్రేమ సమాధానంగా నిలవాలి. కానీ ఓ హీరో విషయంలో అభిమానానికి కాలితో తన్నడం సమాధానంగా మారిందని సదరు హీరోగారి అభిమానులు వాపోతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలిసిపోయుంటుంది మీకు. నటనలో సింహాన్ని జోడించుకున్న బాలయ్య బయట కూడా సింహంలా పంజా విసురుతున్నారు. అదీ అభిమానుల మీద.  

Balayya angry who joined Peaks ... this time kicked the fan

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నందమూరి బాలకృష్ణ ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి మిట్టపల్లి వెళ్లారు. అక్కడ ఆయన అభిమానులు కాన్వాయ్‌కు అడ్డుతగిలారు. అంతే కోపంతో వ్యాన్ పైనుంచి దిగారు సింహం.

దిగి షేక్‌ లాలు, రమేష్, కృష్ణయ్యలను కాలితో తన్నారు. అనంతరం కల్లూరు వెళ్లిపోయారు. గతంలో చాలా సార్లు అభిమానుల మీద చేయి చేసుకున్న బాలయ్య ఈసారి కాలు చేసుకోవడం కలకలం రేపుతోంది.

బాలయ్య వైఖరిపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ.. టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు తగులబెట్టారు.  అభిమానులు అన్నాక ఆమాత్రం హంగామా వుండదా? అభిమానంతో వచ్చేవాళ్ళను అహంకారంతో తన్నడం ఎంతవరకు సమంజసం ?… కాలితో తన్నడం ఎటువంటి సంస్కారం అని నిలదీస్తున్నారు.

వెంటనే బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని, లేదంటే తమ  ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. ‘సినిమాల్లో కనిపించిన ఆయన మీద అభిమానం పెంచుకుని చూడటానికి దగ్గరికి వెళ్ళాం. అది తప్పు అయినట్టు ఆయన కారు మీదనుంచి దిగి కొట్టడం, మరికొంతమందిని కాలితో తన్నడం బాధగా వుంది’ అని బాలయ్య చేతిలో తన్నులు తిన్న అభిమాని లాలు వాపోయాడు.