హిందీలోనూ ఎన్టీఆర్  బయోపిక్

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ  సినిమా తీస్తుండటం తెలిసిందే. బాలయ్యే నిర్మిస్తూ, ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పనులు మెుదలయ్యాయి. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు.  తెలుగుతో పాటు హిందీలోనూ రూపొందించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ తెలిపాడు. ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన రెండో భార్య లక్షీపార్వతి కోణంలో  రామ్ గోపాల్ వర్మ కూడా తీస్తుండటం తెలిసిందే.  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో తెరకెక్కిస్తున్నఈ  సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు  చేస్తున్నారు. దీంతో ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్  జీవితాన్ని తేజ, రామ్ గోపాల్ వర్మ ఎవరు ఎలా చూపిస్తారో  అని ఆసక్తిగా మారింది.

SHARE