బాలక‌‌ృష్ణ హింస - MicTv.in - Telugu News
mictv telugu

బాలక‌‌ృష్ణ హింస

October 28, 2017

బాలకృష్ణ కొత్త సినిమా ‘ జైసింహ ’ సినిమా షూటింగుతో విశాఖ ప్రజలు నానా తిప్పలు పడ్డారు. బీచ్ రోడ్డులో జరుగుతున్న ఈ షూటింగ్ వల్ల ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగస్తులు, స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు, ఆసుపత్రులకు వెళ్ళే రోగులు ఇలా చాలా మంది చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చింది.

బీచ్ రోడ్డులో రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సినిమా షూటింగుతో అక్కడి రోడ్డును బ్లాక్ చేశారు చిత్ర యూనిట్. చాలా మందికి బీచ్ రోడ్ ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా సులువు మార్గంగా వుంటోంది. జనసంచారం, ప్రజలు అవసరార్థం ఎక్కువగా సంచరించే రోడ్డు మీద ఇలా రోడ్డును మూసివేసి షూటింగ్ చేయటంతో విశాఖ వాసులు అసహనం వ్యక్తం చేశారు. శుక్ర, శనివారం రెండు రోజులు షూటింగ్ కొనసాగుతుందట. సామాజిక బాధ్యతున్న హీరో మరియు ప్రజా ప్రతినిధి అయిన బాలకృష్ణ ఇలా తన సినిమా షూటింగ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం అస్సలు బాగా లేదంటున్నారు స్థానికులు. కెయస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.