‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతోనే ఎన్టీఆర్ జీవితం పూర్తవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. తిరుమలకు వెళ్లిన ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు.తాజాగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్‌పై అభిప్రాయం అడగగా.. ఎన్టీఆర్‌పై బాలయ్య ఎన్ని సినిమాలు తీసినా… అది సగభాగమే అవుతుందని అభిప్రాయపడ్డారు. రామ్ గోపాల్ వర్మ తీసే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతోనే ఎన్టీఆర్ జీవితం పూర్తవుతుందని చెప్పారు. వర్మ నిన్న విడుదల చేసిన రెండో పాట ‘ఎందుకు’ తనను బాధపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్మ మనసులో ఏముందో తనకు తెలియదని అన్నారు.