బాలయ్య నొప్పికి  త్వరలో సర్జరీ   - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య నొప్పికి  త్వరలో సర్జరీ  

January 31, 2018

సినీ నటుడు బాలకృష్ణ సర్జరీ చేయించుకోనున్నారు. 8 నెలల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో కుడి భుజానికి గాయమైంది. కానీ బాలయ్య తాత్కాలిక మందులు వాడి వూరుకున్నారు. కారణం..  ఒప్పుకున్న సినిమాలను పూర్తి చెయ్యాలని అనుకున్నారు. అలా నొప్పితోనే పైసా వసూల్, జైసింహ సినిమాల్లో పాల్గొన్నారు.ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్న బాలయ్యకు ఆ నొప్పి మళ్లీ తిరగదోడింది.  డాక్టర్లు ఈసారి సర్జరీ కచ్చితమన్నారు. సర్జరీ చేసుకుంటే మూడు నెలల విశ్రాంతి తీసుకోవలసి వస్తుంది. మూడు నెలలు తను సినిమా షూటింగ్‌లకు దూరంగా వుంటే షెడ్యూళ్ళు డిస్టబ్ అయి నిర్మాతలకు నష్టం వస్తుందని బాలకృష్ణ భావిస్తున్నట్టు సమాచారం.

జైసింహ విడుదలయ్యాక డాక్టర్లు సర్జరీ చేయించుకోవాలని చెప్పినా బాలయ్య వినకుండా ఎన్టీఆర్ బయోపిక్‌కు సిద్ధమయ్యారు. బాలయ్య ఇప్పటికైనా షూటింగులకు బ్రేక్ ఇచ్చి సర్జరీ పూర్తి చేసుకోవాలని, మొండితనం వీడి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సన్నిహితులు సూచిస్తున్నారు. అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. 

సర్జరీకి సిద్ధమయిన బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయ్యాక చేయించుకుంటాడా.. ముందే చేయించుకుంటాడా అనేదాని మీద స్పష్టత రావలిసి వుంది.