బాలయ్య మంచి మసాలాగా మారిండు.. ట్రోల్ చేస్తూ పేజీలు పండగ చేసుకుంటున్నాయి - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య మంచి మసాలాగా మారిండు.. ట్రోల్ చేస్తూ పేజీలు పండగ చేసుకుంటున్నాయి

April 21, 2018

‘ మేరేకు తిన్నది అరుగుత నై హై. బడే డాక్టర్‌కో పిల్చికుని లావో. తిన్నది హజం కాకపోతే మై ఫిర్ ఫిర్ ఖానా ఎట్ల తినాలి హై..  తిన్నది అరగాలె.. ఫిర్కో ఫిర్కో ఖానా తినాలి హై. లేకపోతే జిందగీ కైసా భై. తినాలే.. తిన్నది హజమైందాకా లడ్నా హై.. ఇదే మేరా సిద్ధాంతం హై. జావో జవో నవజవానోం.. డాక్టర్‌కో బులాకే రావో.. ’ ఏంటీ పైత్యం అనుకుంటున్నారా ? పైత్యం కాదు నిన్న నటుడు బాలయ్య ప్రధాని మోదీపై హిందీ భాషలో చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో బాలయ్యను ట్రోల్ చేస్తూ కొన్ని పేజీలు పండగ చేసుకుంటున్నాయి. మనకొచ్చిన భాషలో మాట్లాడితేనే ఎదుటోడికి అర్థమవుతుంది.. ‘ రాని భాషలో మాట్లాడితే నటించినట్టు అవుతుంది.. ఎదుటివాళ్ళకు అర్థంకాక జుట్టు పీక్కుంటారు.. ’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో సందర్భంలో అన్నారు. అది ఇప్పుడు బాలయ్య విషయంలో నిజం అవుతుందనే చెప్పొచ్చు.ప్రధానిని తెలుగు నేర్చుకొమ్మని బాలయ్య బాబు మోడీకి అర్థమయ్యేలా హిందీలో భలే చెప్పాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాని భాషలో బాలయ్య భలే కవర్ చేశాడని అంటున్నారు. ఒక సందర్భంలో మంత్రి కేటీఆర్ ప్రధానిని విమర్శించారని బీజేపీ కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. బాలయ్య కామెంట్ల మీద ఇంకా బీజేపీ నుండి రియాక్షన్ రాలేదా అనుకుంటున్న సందర్భంలో బాలకృష్ణపై గవర్నర్ నరసింహన్‌కు ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ కలిసి మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘ ప్రధానిని విమర్శించిన బాలకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లాం. బాలకృష్ణ అన్నేసి వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు ఖండించకుండా మౌనంగా వున్నారు. ఆయనమీద కూడా చర్యలు తీసుకోవాలని కోరాం ’ అని అన్నారు.