వయసుకు తగ్గ పాత్రలో బాలయ్య - MicTv.in - Telugu News
mictv telugu

వయసుకు తగ్గ పాత్రలో బాలయ్య

April 2, 2018

తెలుగు సినీ హీరోలు చట్రంలో ఇరుక్కుని హీరోయిజం చెలాయిస్తారని, వయసుకు సంబంధం లేని పాత్రలు చేసి కలకాలం హీరోలుగానే వర్ధిల్లాలనుకుంటున్నారని ఆరోపణలు. దీన్ని తోసి పుచ్చుతూ హీరో బాలకృష్ణ ఓ వైవిద్యమున్న పాత్రలో నటించటానికి పచ్చజెండా వూపారు. వివి. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య తన 57 ఏళ్ళ వయసుకు తగ్గ వృద్ధుడి పాత్ర పోషిస్తున్నాడట.

ఇది గాడ్‌ఫాదర్ తరహా పాత్ర అని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయ్యాక ఈ సినిమాలో నటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కథ, కథనాలు నచ్చటంతో వివి. వినాయక్‌కు ఓకే చెప్పాడట బాలయ్య. ఇదివరలో చెన్నకేశవరెడ్డి, ఒక్కమగాడు సినిమాల్లో పెద్ద వయసు పాత్రలు ధరించాడు బాలకృష్ణ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.