నడి బజారులో బ్యాలెట్ బాక్స్‌ - MicTv.in - Telugu News
mictv telugu

నడి బజారులో బ్యాలెట్ బాక్స్‌

December 8, 2018

రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే ఓ బ్యాలె‌ట్ బాక్స్ రోడ్డుపై దర్శనమివ్వడంతో సంచలనానికి దారి తీసింది. కిషన్‌గంజ్ నియోజకవర్గంలోని షాహబాద్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేసి ఉండటంతో పోలీసులు ఎన్నికల అధికారులకు సమాచారం అందజేసి, ఆ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఎన్నికలు పూర్తయిన బ్యాలెట్ బాక్స్‌లను వాహనాల్లో తర్వాత స్ట్రాంగ్ రూం‌కు  తరలించేటప్పుడు కింద పడిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం దాన్ని కిషన్‌గంజ్‌లో ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఇందుకు కారణమైన ఇద్దరు అధికారులు రఫీక్, నవల్ సింగ్ పట్వారీలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని సమాచారం.

కాగా రాజస్తాన్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 72.7 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. మరో స్థానంలో అల్వార్ నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ మరణించడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.