తొక్కే కదా అని పాడేస్తే..చాలా మిస్సవుతారు ! - MicTv.in - Telugu News
mictv telugu

తొక్కే కదా అని పాడేస్తే..చాలా మిస్సవుతారు !

March 9, 2018

అరటి పండు తినడం వలన ఎన్ని ఉపయోగాలో అందరికి తెలిసిందే. కానీ అరటి తొక్కతో కూడా  ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తెలుసా?

1.దంతాల మీద అరటితొక్కతో ప్రతి రోజూ రుద్దాలి. అలా  వారం రోజులు చేయడం వలన దంతాలు మిలమిలా మెరుస్తాయి.

  1. శరీరంపైన కాలిన గాయాలు ఉంటే అరటి తొక్క మంచి ఔషదంగా పని చేస్తోంది. కాలిన భాగంపై అరటితొక్కను ఉంచి కట్టు కట్టాలి.రాత్రింతా అలానే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే రెండు ,మూడు రోజుల్లో దెబ్బలు తగ్గుతాయి.
  1. చర్మ సౌందర్యం పెంచుకునేందుకు కూడా అరటి పండు తొక్క మంచి ఉపయోగపడుతుంది. అరటితొక్కలో  యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి చ‌ర్మాన్ని ర‌క్షిస్తాయి. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అర‌టి పండు తొక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల  చర్మంపై ముడుతలు రాకుండా ఉంటుంది. దాంతో చ‌ర్మం కాంతివంత‌మ‌వుతుంది. అర‌టి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అర‌గంట సేపు ఆగాక గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క‌డిగేయాలి. దీంతో పైన చెప్పిన చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి.

 

  1. చ‌ర్మంపై ఏర్ప‌డే దుర‌ద‌లు, మంట‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ అర‌టి పండు తొక్క  ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంపై అర‌టి పండు తొక్క‌ను రాసి 10 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. దీంతో దుర‌ద‌, మంట త‌గ్గిపోతుంది.

 

  1. శ‌రీరంలో ఏదైనా భాగం నొప్పిగా ఉంటే అక్క‌డ అర‌టి పండు తొక్క‌ను కొద్ది సేపు మ‌సాజ్ చేసిన‌ట్టు రాయాలి. ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే నొప్పి మాయ‌మ‌వుతుంది.

 

  1. పురుగులు, కీట‌కాలు కుట్టిన చోట దుర‌ద‌గా ఉన్నా అర‌టి పండు తొక్క‌ను రాస్తే చాలు. వెంట‌నే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

ఇన్ని లాభాలున్నాయని తెలిశాక ఎవరైనా తొక్కను పాడేస్తారా? చెప్పండి