సార్వత్రిక ఎన్నికలు తమురుకొస్తున్నాయి. దీంతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం పైన దృష్టిపెట్టాయి. అన్ని రాజకీయ పార్టీలు వినూత్నంగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ వినూత్నంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఓ ర్యాప్ సాంగ్‌ను రూపొందించి, పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మోదీ 2014 లో ప్రధానమంత్రి అయినప్పటినుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను, చేసిన అభివృద్ధిని ఈ ర్యాప్ సాంగ్‌లో ప్రస్తావించారు. సాంగ్‌లో కొన్ని ప్రశ్నలను సంధించి వాటికి సమాధానాలు కూడా తెలిపారు. అలాగే మోదీ చాయ్ వాలా ఇమేజ్‌ని కూడా మరోసారి గుర్తుచేసారు.ప్రధానమంత్రి అవినీతిపరులపై చేసిన వ్యాఖ్యలను బలంగా చూపించారు. దేశవ్యాప్తంగా జరిగిన వివిధ సభలలో మోదీ వేసిన పంచ్ డైలాగులను కూడా ర్యాప్ సాంగ్‌లో చేర్చడంతో సాంగ్ ఇంకా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈరోజు బాలీవుడ్లో ‘గల్లీ బాయ్’ అనే సినిమా విడుదలైనది. ఆ చిత్రం కూడా ర్యాప్ సాంగ్స్ నేపథ్యంలో సాగుతుంది. దీనితో ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ సాంగ్ రూపొందించి వుంటారని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
The rap India had to wait for decades to tap!
“Banda Apna Sahi Hai…
बंदा अपना सही है…”
Download from https://t.co/miwYXnQEaq pic.twitter.com/Dpo83b0YCb
— BJP (@BJP4India) February 13, 2019