వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య

March 19, 2018

ప్రేమకు అర్థం  మారిపోతోంది. ఇద్దరు ఇష్టపడ్డం ప్రేమ. కానీ ఏకపక్ష మోహమే ప్రేమ అని యువత భావిస్తున్నట్లుంది. తాను ప్రేమించాను కాబట్టి, అవతలి వ్యక్తి కూడా ప్రేమించి తీరాల్సిందే అనే పట్టుదలకు పోతోంది. దీంతో నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ప్రేమ పేరుతో వేధింపులను తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని షిమోగాలో జరిగింది.వెంకటేశ్ నగర్‌కు చెందిన చేతన (19) అక్కడే  ఓ కంపెనీలో పని చేస్తోంది. ఆ కంపెనీ ఎదురుగా  మొబైల్ దుకాణం నడుపుతున్న శ్రీనివాస్ తనను ప్రేమించాంటూ  ఆమెను వేధించేవాడు. తనకు ఇష్టం లేదని ఆమె పలుమార్లు చెప్పింది. అయినా  శ్రీనివాస్ వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన చేతన తన బాధను ఇంట్లో చెప్పుకోలేక, జీవితంపై విరక్తి చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలను  తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.