క్రికెటర్ ప్రేమ పెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెటర్ ప్రేమ పెళ్లి

November 1, 2017

బంగ్లాదేశ్ క్రికెటర్ తస్కిన్ అహ్మద్ తన స్నేహితురాలు సయీదా రబియాను పెళ్లాడాడు. ఢాకాలోని  షయెమోలి కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం రాత్రి ఘనంగా వీరి పెళ్లింది. ఈ వివాహానికి బంగ్లాదేశ్  క్రికెటర్లు మోర్తజా, తమీన్ ఇక్బా‌బ్‌లు హాజరయ్యారు. తస్కిన్, రబియాలు ఏడాది క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌లోని అమెరికా ఇంటర్నేషనల్ వర్సిటీలో తస్కిన్, రబియా కలసి చదువుకున్నారు. అప్పుడే వీరి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో చిట్టగాంగ్ వైకింగ్స్ జట్టు తరపున తప్కిన్ ఆడనున్నాడు.