ఈ యాప్ ద్వారా బ్యాంకు రుణాలు సులువుగా తీసుకోవచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

ఈ యాప్ ద్వారా బ్యాంకు రుణాలు సులువుగా తీసుకోవచ్చు

February 24, 2018

లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి. అంత తిరిగినా ఒక్కోసారి లోన్లు రావు. భూములు, ఇళ్లు కొనుక్కోవటానికి, పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి చాలామంది బ్యాంకుల్లో రుణాల కోసం ప్రయత్నిస్తుంటారు.

ఒక్కోసారి డాక్యుమెంట్లు సరిగా లేవు అని కుంటి సాకులు చెబుతూ బ్యాంకుల వాళ్ళు లోన్లు ఇవ్వరు. అలాంటి సమయంలో మనం అనుకున్న పని కాక చాలా నిరాశలో ఉంటాం. అలాంటి వారికి ఇప్పుడు వరంలా మారింది ‘ మనీట్యాప్ ’ యాప్. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉన్నచోట నుంచే కదలకుండా కావాల్సిన రుణాన్ని అందించేలా ఈ మనీట్యాప్ యాప్ సేవలందిస్తోంది.ఈ మొబైల్ యాప్ ద్వారా రూ. 3000 నుంచి రూ. 5లక్షల వరకు అప్పు తీసుకోవచ్చు. తీసుకున్న మొత్తాన్ని రెండు నెలల నుంచి 3 సంవత్సరాల లోపు నెలవారి వాయిదాల్లో చెల్లించవచ్చు. రూ. 300 కోట్ల రుణాలు మంజూరు చేసే లక్ష్యంతో ప్రారంభించిన క్రెడిట్ లైన్ మనీట్యాప్ యాప్. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో సేవలందిస్తోంది. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అలాగే విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో కూడా వినియోగదారుల కోసం తమ సేవల్ని తెలుగులో ప్రారంభించింది. ఎవరైనా ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సాధారణంగా బ్యాంకులో సమర్పించే వివరాలు సమర్పించి లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న మొత్తం చెల్లింపులపై ఆధారపడి క్రెడిట్ లిమిట్ పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.కునాల్ వర్మ, బాల పార్థసారథి, అనూజ్ కాకర్, పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో ప్రారంభించిన ఈ సార్టప్ యాప్ ఇప్పుడు 10 లక్షల మందికి పైగా వినియోగదారులను ఆకర్షించి ముందుకు దూసుకుపోతోంది.

ఈ యాప్ ద్వారా నిమిషాల్లో ప్రాసెస్ పూర్తి చేయడంతో పాటు లక్షల్లో లోను తీసుకునే అవకాశం ఉంది.

నెలకు ఇరవై వేలకు పైగా ఆదాయం గల ఉద్యోగులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఈ యాప్ ద్వారా క్రెడిట్ పొందవచ్చు. తీసుకున్న మొత్తం మీద వార్షికంగా 1.08 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి ఈఎంఐలు చెల్లించిన వాళ్లు తిరిగి అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

దీన్నెలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి :

మనీట్యాప్ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లోన్‌కి అప్రూవల్ పొందాక డాక్యుమెంట్లు సమర్పించి తుది అనుమతి పొందాలి. కావల్సిన మొత్తాన్ని డ్రా చేసుకొని, చేసుకున్న మొత్తాన్ని తమ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తిరిగి వాయిదా పద్ధతిలో చెల్లించుకోవచ్చు.

బ్యాంకు స్టేట్ మెంట్లను రిజిస్టర్ చేసుకున్నాక ఈమెయిల్‌కి పంపిస్తారు. ఇందులో నెట్ బ్యాంకింగ్ సేవలను కూడా పొందవచ్చు. eKYC పూర్తి అయిన తరువాత తమ లోన్ మొత్తం వడ్డీ వివరాలతో కలిపి వారి అకౌంట్లోకి ట్రాన్సఫర్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే [email protected]కి మెయిల్ చేసి తెలుసుకోవచ్చు.