ముచ్చటగా మూడవరోజు… ముద్దపప్పు బతుకమ్మ... - MicTv.in - Telugu News
mictv telugu

ముచ్చటగా మూడవరోజు… ముద్దపప్పు బతుకమ్మ…

October 11, 2018

9 రోజుల బతుకమ్మ పండగ ఉత్సవాల్లో ఈరోజు మూడవరోజు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండోరోజు అటుకుల బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. మూడో రోజైన నేడు ‘ముద్దపప్పు బతుకమ్మ’. మహిళలంతా పూలజాతరకు ఇవాళ కూడా చాలా హుషారుగా సిద్ధమయ్యారు. ఈ రోజుకూడా  మహిళలు, ఆడపిల్లలు ఎంతో సంబురంగా పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ అవనిని పులకింపజేస్తారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజారంజకమైన పాటలు పాడుతారు.The third day of the bathukamma festival ... muddappappu batukhamma …ముద్దపప్పు బతుకమ్మను పురస్కరించుకుని అమ్మ వారికి ముద్ద పప్పు , బెల్లం, పాలు కలిపిన పదార్థాలను నైవేద్యం గా సమర్పిస్తారు. ఈ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మేలైనది. పల్లెలన్నీ ఉయ్యాల పాటలు, కోలాటాల, గౌరమ్మ పూజలతో  పరవశిస్తున్నాయి. బతుకమ్మ వేడుకలు ఇంటింటా ఘనంగా జరుగుతున్నాయి. ఆడపడుచులందరూ ఆనందాల్లో మునిగి తేలుతున్నారు.