mictv telugu

బావర్చి హోటల్ సీజ్.. చెబితే వింటేనా?

January 7, 2019

చట్టాలు ఎవరి చుట్టాలూ కావని జీహెచ్ఎంసీ అధికారులు రుజువు చేశారు. హైదరాబాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని రెండు హోటళ్లను ఈ రోజు సీజ్ చేశారు. బావర్చి, కస్పోడియన్‌ హోటళ్లు  వ్యర్థాల నిర్వహణకు కంపోస్ట్ పిట్లను  ఏర్పాట్లు చేయకపోవడంతో సీజ్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

కంపోస్ట్ పిట్లను ఏర్పాటు చేసుకోవాలని ఈ హోటళ్లకు ఎన్నోసార్లు నోటిసులిచ్చా మని, యజమానులను పిలిపించిన మాట్లాడినా ఫలితం లేకపోవడంతో సీజ్ చేశామని తెలిపారు.  ‘హోటల్‌ నిర్వాహకులకు తడి, పొడి చెత్తను వేరు చేయాలని,  ఆర్గానిక్‌ వేస్ట్‌ కన్వర్టర్‌ యంత్రాన్ని పెట్టుకోవాలని చాలసార్లు చెప్పాం. అయినా పట్టించుకోలేదు. జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా  వ్యర్థపదార్థాలను మ్యాన్‌ హోల్‌లోకి వదులుతున్నారు. 2016 నుంచి నోటీసులు ఇస్తున్నా స్పందించకపోవడంతో ఈ  రోజు సీజ్‌ చేశాం. ఆస్టోరియాతో పాటు పలు హోటళ్లకు నోటీసులు జారీచేశాం..’ అని జీహెచ్ఎంసీ అధికారి హేమలత చెప్పారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమగ్ర వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం నిత్యం 50 కిలోల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేసే హోటళ్లు సేంద్రియ ఎరువుల ఉత్పత్తి కోసం పిట్‌ను ఏర్పాటు చేయాలి.  అయితే హైదరాబాద్‌తోపాటు వరంగల్ వంటి ఇతర నగరాల్లోనూ ఇది అమలు కావడం లేదు. గత ఏడాది ఆగస్టు 15 వరకు అధికారులు గడువు ఇచ్చారు. అయినా హోటళ్లు పట్టించుకోలేదు. దీంతో గతవారం కూకట్‌పల్లి గ్రీన్‌ బావర్చి, ఘుమఘుమలు హోటల్‌, మూసాపేట కోహినూర్‌, అరేబియన్‌ హోటళ్లను సీజ్‌ చేశారు.

Telugu news bawarchi hotel at hyderabad rtc crossroads  seized non non compliance compost pits waste management rules