కోహ్లీ టీంకు బీసీసీఐ నగదు బహుమతి - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీ టీంకు బీసీసీఐ నగదు బహుమతి

January 9, 2019

భారత క్రికెటర్లకు బీసీసీఐ నగదు నజరానాలు ప్రకటించింది. ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏళ్ళ తర్వత ఆస్ట్రేలియాను ఓడించి, భారత్ టెస్ట్ సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాలో భారత్‌ ఆడిన తొలి టెస్ట్‌లో గెలుపొందగా, రెండో టెస్ట్‌‌లో ఆసీస్‌ గెలిచింది. మూడో టెస్టును భారత్‌ సొంతం చేసుకోగా, చివరి టెస్ట్‌ డ్రాగా ముగియడంతో భారత్‌ సిరీస్‌ను 2-1 తేడాతో ముగించి విజయ దుందుభి మోగించింది.

Telugu news BCCI Announces Cash Prizes For Victorious Team India, Coaches And Support Staff

ఇంత చేసిన ఆటగాళ్ళకు తనవంతుగా ఏదైనా చేయాలని భావించింది భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి. ఈ నేపథ్యంలో నగదు  నజరానలను ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టుకు బీసీసీఐ శుభాకాంక్షలు తెలుపుతూ… ఈ పర్యటనకు ఎంపికైన జట్టులోని అందరు ఆటగాళ్లకు( రిజర్వ్‌ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది) నగదు పురస్కా రాలను ప్రకటించింది.

బోనస్‌లు మ్యాచ్‌ ఫీగా చెల్లించే అసలు మొత్తానికి సమానంగా ఉంటుందని వెల్లడించింది. చివరి 11మందిలో ఉన్న ఆటగాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో మ్యాచ్‌‌కు బోనస్‌ రూపేణ రూ. 15 లక్షలు, రిజర్వ్‌ ఆటగాడికి రూ.7.5 లక్షలు అందజేయనున్నట్టు బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగు టెస్టులకు గాను ఒక్కో ఆటగాడు రూ.60 లక్షలు పొందనుండగా, రిజర్వ్‌ ఆటగాడు రూ.30 లక్షలు పొందనున్నాడు. కోచ్‌లకు తలా రూ. 25 లక్షలు అందించనుంది. ఇతర సిబ్బందికి వారు పనిచేసిన సమయాన్ని బట్టి నజరానాలు ఇవ్వనున్నట్టు బీసీసీఐ తెలిపింది. Telugu news BCCI Announces Cash Prizes For Victorious Team India, Coaches And Support Staff