మంచి మనసుకు కేరాఫ్ సమంత - MicTv.in - Telugu News
mictv telugu

మంచి మనసుకు కేరాఫ్ సమంత

November 2, 2017

‘ప్రత్యూష ఫౌండేషన్’ ద్వారా సినీనటి సమంత పలు సామాజిక సేవలు చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్న విషయం తెలిసిందే.

సినిమాలు, పెళ్ళి పనుల్లో బిజీగా వుండి కూడా పేద పిల్లల ఆరోగ్యం కోసం సమయాన్ని కేటాయించడం ఆమె అభిమానుల్లో హర్షాన్ని నింపుతున్నది. వైద్యం చేయించుకునే స్థోమతలేని పేద పిల్లలకు తన సంస్థ ద్వారా ఉచిత వైద్యాన్ని అందించింది. గుండె సంబంధిత రుగ్మతలతో బాధ పడుతున్న 15 మంది చిన్నారులకు కార్డియాక్ సర్జరీ చేయించింది. సర్జరీ అయ్యాక చిరునవ్వుల చిందిస్తున్న పిల్లలతో దిగిన ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. విజయవాడలోని పలు ఆసుపత్రుల్లో ఈ ఉచిత కార్డియాక్ సర్జరీలు నిర్వహించినట్లు తెలిపింది. ఇంతకు ముందు కూడా సమంత తన ఫౌండేషన్ ద్వారా చాలా మంది చిన్నారులకు వైద్య సేవలు చేయించి తన ఉదారతను చాటుకున్నది. భౌతిక అందమే కాదు మానసిక అందం కూడా మనిషికి చాలా అవసరం అని నిరూపిస్తున్న ఈ అక్కినేని కోడలు మీద సోషల్ మీడియాలో ప్రశంసల ఝల్లు కురుస్తున్నది.