యాసిడ్ దాడిలో విరిసిన అందమైన ప్రేమకథ.. తనూ, ఆయన, పాప…
ప్రేమంటే ఒక అందమైన ఫీలింగ్. ఇద్దరిమధ్య జీవితకాలం నిలిచే ఓ సద్భావన. కానీ కొందరు ఆ భావాన్ని ఓ అందమైన జంట కిందకు మార్చేశారు. అందంగా వున్నయువతి కనిపిస్తే చాలా కామంలో కళ్ళు మూసుకుపోయి ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనకుని, దానికి ప్రేమ అనే ముసుగు ధరిస్తారు. ఈ క్రమంలో వేధింపులు మొదలు పెడతారు. ఆమె తన ప్రేమను తిరస్కరించిందని యాసిడ్ దాడులు, కత్తుల దాడులకు పాల్పడి ప్రేమోన్మాదులు అవుతారు. అయినా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే హక్కు అబ్బాయికి ఎవరిచ్చారు?
కానీ కొందరు కేవలం అందమే ప్రేమకు పునాధి వేయకూడదని భావించాడు. అందం దేనికి అసలు కొలమానమే కాదు అనుకున్నాడు. శారీరక అందం కాదు మానసిక అందం చాలా గొప్పదని చాటాడు.
గొప్ప ప్రేమకథ…
కొన్ని ప్రేమ కథల్లో లక్ష్మి- అలోక్ దీక్షిత్‌లది మాటల్లో చెప్పలేని గొప్ప ప్రేమకథ. లక్ష్మి ఢిల్లీలో నివసించే ఒక అమ్మాయి. 2005లో ఒక వ్యక్తి ప్రేమ ఇష్టం లేదు అన్నందుకు లక్ష్మీపై యాసిడ్ పోసాడు. శరీరంలో సగభాగం కాలిపోయింది.అయినా ఎక్కడ ధైర్యం కోల్పోకుండా చావుతో పోరాడి గెలిచారు. తరువాత ఎన్నో పోరాటాలు చేసి సుప్రీమ్ కోర్ట్ నుంచి యాసిడ్ అటాక్‌లపై కొత్త చట్టం వచ్చేలా చేశారు.
యాసిడ్ దాడి తరువాత ఏడాదిపాటు తన ముఖాన్ని తానే చూసుకోలేదు. ఆ తర్వాత అద్దంలో చూసుకుని తానేనా ? అనుకుందట. ఇకపై ఇదేనా నేను?! ఇక నేను ఎవరి ముఖమూ చూడాలనుకోలేదు అని తీవ్ర ఒత్తిడికి లోనైయ్యారట. పూర్తిగా ఒంటరి జీవితానికి అలవాటు పడ్డారు. అప్పుడే మళ్లీ దీక్షిత్ రూపంలో ప్రేమని గుర్తించానని చెప్పారు. ఏడు శస్త్రచికిత్సలతో నమ్మకం వచ్చిందట తనకు. ఇదివరకే ఇలాంటి దాడులకి గురైన వ్యక్తులు ఏం చేస్తున్నారని వాళ్ళను కలవడం మొదలు పెట్టారు. అసలు ఇలాంటివి జరుగుతున్నాయంటే యాసిడ్ మార్కెట్లో విరివిగా దొరకడమేగా కారణం? దానిపై పోరాడాలనుకున్నారు. ‘చాన్ వీ’ సంస్థని ప్రారంభించారు. అక్కడే అలోక్ దీక్షిత్ పరిచయమయ్యాడు.
అతను వైమానిక దళంలో పనిచేసేవాడు. అక్కడ రాజీనామా చేసి పాత్రికేయుడయ్యాడు. దాన్నీ కాదనుకుని తనలాంటి బాధితురాళ్ల కోసం ఉద్యమించాడు. ఎంతో ప్రపంచాన్ని చూసినవాడు. కానీ తన కళ్లని చూడగానే తడబడ్డాడు. అదేమిటని అనుకున్నానారామె. తన ముఖం ఇలా ఉందనే అసహ్యమా? అతని తడబాటు వెనక ఇంకేదో వుందనుకుందామె. ఈ క్రమంలో నాలుగు నెలలు.. కలిసి ఉద్యమించారు. మంచీ చెడూ పంచుకున్నారు. ఇద్దరూ ఒక్కటయ్యారు. తన ముఖం అంద విహీనంగా వుందని తను భావించినా. దీక్షిత్ ఆమెలోని అందమైన మనసునే చూశాడు. పెళ్ళి చేసుకున్నాడు.
అప్పుడే తనపై యాసిడ్ దాడి చేసిన వ్యక్తి జైల్లో నుంచి బయటకొచ్చాడు. వచ్చీరాగానే ‘లక్ష్మిని నేను పెళ్లాడతా!’ అన్నాడు. అందుకు లక్ష్మి నిరాకరించారు. దీక్షితే తనకు సరైనవాడు అనుకున్నారు. ఒకరిపై ఒకరికున్న ఆరాధనకీ, జీవితాంతం తోడు నిలుస్తారనే అపార నమ్మకానికి పెళ్లి ధ్రువపత్రాలు ఎందుకూ అనిపించింది వాళ్లకు. దీక్షిత్ వాళ్లది సంప్రదాయ కుటుంబం. ప్రతిదానికీ పట్టింపులెక్కువ. మొదట నిరాకరించినా తర్వాత ఒప్పుకున్నారు. అలా అమెరికా నుంచి అంతర్జాతీయ సాహస మహిళా పురస్కారం, ఓ ప్రఖ్యాత టీవీలో యాంకరింగ్ అవకాశం, షిరోస్ కెఫె ఏర్పాటు ఇలా చాలా రంగాల్లో రాణించారామె. వారికో ముద్దుల పాప కూడా వుంది. ‘పెద్దయ్యాక.. ఈ పాప నన్ను చూసి భయపడుతుందేమో? అసహ్యించుకుంటుందేమో!’ అని లక్ష్మి భయపడింది. అలోక్తో చెబితే ‘కాదు. నీ అంత అందమైన అమ్మకి కూతురిగా పుట్టినందుకు గర్వపడుతుంది!’ అని దీక్షిత్ చెప్పాడు.
Telugu news Beautiful love story broke in acid attack .. self he baby …