ఈనగరానికి ఏమైంది..ఓవైపు రంగులు,మరోవైపు హంగులు - MicTv.in - Telugu News
mictv telugu

ఈనగరానికి ఏమైంది..ఓవైపు రంగులు,మరోవైపు హంగులు

November 23, 2017

నగరానికి రంగులద్దారు, మెరుపులు దిద్దారు. ఎక్కడ చూసినా అద్దమోలె మెరిసిపోతున్న రోడ్లు, అందంగా ముస్తాబైన గోడలు, ప్లై ఓవర్లు. అంతా అంతర్జాతీయ అతిథిల పుణ్యమే. ఇంధ్రదనస్సు రంగులతో, మిరుమిట్లు గొలిపే మెరుపులతో  అతిథిలకు ఆహ్వానం పలికేందుకు  హైద్రాబాద్ నగరం ముస్తాబైంది. నవంబర్ 28,29 తేదీల్లో జరిగే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు 170 దేశాలకు  చెందిన ప్రతినిథులు పాల్గొంటున్నారు.ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిడ్డె ఇవాంకా వస్తుండడం . ఇప్పటికే ఆమె భద్రతకోసం అమెరికా భద్రతా సిబ్బంది ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. ఆమెకోసం ఇప్పటికే అమెరికా నుండి 100 మంది ఉద్యోగులు హైద్రాబాద్ లో అడుగుపెట్టారు. అంతర్జాతీయ ప్రముఖులకు హైద్రాబాద్ నగరాన్ని కనువిందుగా చూపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాయి. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగే ఈ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఇవాంకా ట్రంప్ ప్రారంభిస్తారు.