సాయిపల్లవి ఎందుకు మేకప్ వేసుకోదంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

సాయిపల్లవి ఎందుకు మేకప్ వేసుకోదంటే..

March 3, 2018

వెండితెర మీదకు రివ్వున వచ్చి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన చలాకీ పిల్ల సాయిపల్లవి. మేకప్ లేకుండా నటించే నటీమణుల కోసం భూతద్దం పెట్టి వెతికితే ఏ ఒక్కరు కూడా దొరకరు. కానీ సాయిపల్లవి మాత్రం చటుక్కున దొరికిపోతుంది. దీనికి కారణాలను  సాయిపల్లవి తాజాగా మీడియాతో పంచుకున్నారు.

తన తొలి సినిమా ‘ప్రేమమ్‌’ దర్శకుడు ఆల్ఫోన్స్‌ ‌ పుతెరిన్‌‌ దీనికి కారణమని ఆమె చెప్పారు. ఆ తర్వాత పని చేసిన దర్శకులందరూ ఆమెకు మేకప్ లేకుండా సహజంగాగనే నటించమని తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని చెప్పింది. అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా ఇలా చేస్తున్నట్లు సాయిపల్లవి  పేర్కొంది.

స్క్రీన్ మీద మేకప్‌తో అందంగా కనిపించే భామలు మేకప్ తీసేస్తే అసలు ఈమె హీరోయినేనా అనే అనుమానం కలుగుతుంది. కానీ సాయి పల్లవి అలా కాదు. తను  మేకప్ లేకుండా మొటిమల ముఖంతో ఎలా వుంటుందో తెర మీద కూడా అలాగే వుంటుంది. ‘ సహజనటి అని అంటే గింటే సాయిపల్లవిని అనొచ్చు ’ అంటున్నారు సాయిపల్లవి అభిమానులు. తను నటించిన ‘ కణం ’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తమిళంలో ధనుష్ సరసన ‘ మారి 2 ’ లో నటిస్తోంది.