బిచ్చగాళ్లలో ఉమ్మడి ఏపీకి మూడో స్థానం - MicTv.in - Telugu News
mictv telugu

బిచ్చగాళ్లలో ఉమ్మడి ఏపీకి మూడో స్థానం

March 21, 2018

దేశంలో యాచకులు ఎక్కువగా వున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 30,218 మంది యాచకులతో మూడవ స్థానంలో నిలిచింది. సంబంధిత నివేదికను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో  4,13,670 మంది యాచకులు, సంచార యాచకులు వున్నట్టు నివేదికలో పేర్కొన్నారు.

వారిలో 2,21,673 మంది పురుషులు కాగా, 1,91,997మంది స్త్రీలు. 81వేల మంది బిచ్చగాళ్లతో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలబడింది. ఉత్తరప్రదేశ్‌ 65,835మంది యాచకులతో రెండో స్థానంలో నిలబడింది. కేవలం ఇద్దరు యాచకులతో లక్షద్వీప్‌ చివరి స్థానంలో ఉంది.

రాష్ట్రాలతో పోల్చుకుంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో యాచకులు తక్కువే. 2,187మంది యాచకులతో దేశ రాజధాని ఢిల్లీ  ప్రథమ స్థానంలో ఉండగా, కేవలం ఇద్దరు యాచకులతో లక్షద్వీప్‌ చివరి స్థానంలో ఉంది. డామన్‌ డయ్యూలో 22మంది, దాద్రా నగర్‌ హవేలీలో 19మంది, అండమాన్‌ నికోబార్‌లో 56 మంది యాచకులు ఉన్నారు. యాచకులు, ఆశ్రిత కులాలు, సంచార జాతులు, వృత్తి పనులు చేసుకునేవారిని ఓబీసీల్లో ఉపకులాలుగా చేర్చుకోవాలని వెనకబడిన తరగతులకు చెందిన ఒక సంస్థ జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌ను కోరింది.

కాగా వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య జాతీయ వెనకబడిన  కులాల కమిషన్‌కు ఒక లేఖ రాశారు. యాచకులను, వృత్తి పనులను చేసుకునే వారిని, సంచార జాతులను, ఆశ్రిత కులాల వారిని ఓబీసీలోని ‘ఏ’ కేటగిరీలో ఉప కులాలుగా చేర్చాలని కోరారు.