నగ్నంగా నిద్రపోతే ఒంటికీ, సెక్స్‌కూ మంచిది!

నాగరికత మనుషులకు బట్టకట్టడం నేర్పింది. అయితే కొన్ని విషయాల్లో మటుకు నగ్నత్వమే మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు. రాత్రిళ్లు దిగంబరంగా నిద్రపోవడం వల్ల దేహానికి మేలు చేకూరుతుందని అంటున్నారు. మానసిక ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుందని, సెక్స్ విషయంలోనూ చురుగ్గా ఉంటారని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.Telugu news Benefits of Sleeping Naked You Probably Didn’t Know60 నుంచి 67 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రత నగ్నంగా పడుకోవడానికి అనువుగా ఉంటుంది. దుస్తులు లేకపోవడం వల్ల గుప్తాంగాలకు గాలి సోకి ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉండదు. చర్మ సంబంధ  ఇన్ ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. గాలి ఆడనివ్వని దుస్తులు, తడి వాతావరణం వల్ల ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ పెరుగుతుందని డాక్టర్ వింటర్ అనే నిపుణుడు చెప్పారు. మహిళలకు ఈస్ట్ సంబంధ ఇన్ఫెక్షన్ల సోకకుండా ఉండాలంటే నగ్నంగా నిద్రపోవడం మంచిదని క్లినికల్ ప్రొఫెసర్ మేరే జేన్ మింక్లిన్ సూచిస్తున్నారు.

శృంగారానికి ప్రేరణ..

నగ్నంగా నిద్రపోవడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య పరస్పర స్పర్శ ఉంటుందని, ఫలితంగా కోరిక మరింత ఉధృతమై వారి సెక్స్ అనుభవం చక్కగా ఉంటుందని బయలాజికల్ ఆంత్రపాలజిస్ట్ హెలెన్ ఫిషర్ చెప్పారు. ‘మీ జీవిత భాగస్వామిని హత్తుకోవడం వల్ల అక్సోటిన్‌ స్పందిస్తుంది. ఫలితంగా ఒత్తిడికి సంబంధించిన కార్జిజోల్ అనే అనే హోర్మోన్ ప్రభావం తగ్గిపోతుంది.. ’ అని వివరించారు. అంతేకాకుండా పురుషుల్లో వీర్యం నాణ్యత కూడా పెరుగుతుందని వెల్లడించారు. వృషణాలకు గాలి తగలడం వల్ల పునురుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని,  వస్త్రరహితంగా పడుకోవడం వల్ల దంపతులు ఒకరికొకరు మరింత సెక్సీగా కనిపిస్తారని, వారి దాంపత్య జీవితం హాయిగా ఉంటుందని పేర్కొన్నారు.gu news  Benefits of Sleeping Naked You Probably Didn’t Know