ఆ కోడిపెట్టను చూడ్డానికి ఊళ్లు తరలొస్తున్నాయ్.. - MicTv.in - Telugu News
mictv telugu

 ఆ కోడిపెట్టను చూడ్డానికి ఊళ్లు తరలొస్తున్నాయ్..

December 7, 2018

ఈ కలికాలంలో వింతలకు కొదవలేదు. ఓ కోడిపెట్టను చూడ్డానికి చుట్టపక్కల గ్రామాల జనం పోటెత్తిపోతున్నారు. అది బాగా ముక్కిముక్కి ఓ వింతను సృష్టించి రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయింది మరి. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో జరిగిందీ తతంగం.

Bengal hen lays five-inch jumbo egg.

నోపారా గ్రామానికి చెందిన సుజాతా దాస్ అనే మహిళ కోళ్లను పెంచుకుంటోంది. అందులో ఓ గుడ్ల కోడి ఉంది. సుజాత మంగళవారం అది గుడ్డు పెట్టిందేమోనని గంప తీసి చూసింది. పేద్ద గుడ్డును చూసి నోరెళ్ల బెట్టింది. ఆ గుడ్డు సాధారణ కోడిగుడ్లతో పోలిస్తే మూడింతలు ఉంది. ఐదు అంగుళాల పొడవుంది. క్షణంలో ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. ఊరి నుంచి ఊరికి అలా చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో పెట్టను చూడ్డానికి, వీలైతే కొనడానికి జనం తరలి వచ్చేస్తున్నారు.  ‘మా ఇంట్లో 10 పెట్టలు ఉన్నాయి. నేను ఎప్పుడూ ఇంత పెద్ద గుడ్డును చూడలేదు..’ అని సుజాత పొంగిపోతోంది. ఆ వింత కోడిని పరీక్షించడానికి పశువైద్యులు రానున్నారట.

Telugu news Bengal hen lays five-inch jumbo egg At almost three times the size of a normal egg and more than five inches in size, this eggsquisite egg is the talk of the region.