జైళ్లోకి  తిరిగి పయనమైన  శశికళ…!

పెరోల్‌పై బయటకు వచ్చిన అన్నాడీఎంకే  బహిష్కృత నేత శశికళ, తిరిగి జైలుకు పయనం అయ్యారు. తన భర్త నటరాజన్ అనారోగ్యం దృష్ట్యా ఆమెకు బెంగుళూర్ కోర్టు ఐదు రోజులు పెరోల్ మంజూరు చేసింది. గురువారం ఉదయం శశికళ తన మద్దతుదారులకు, కార్యకర్తలకు అభివాదం చేసి బెంగుళూర్ పరప్పన అగ్రహారం జైలుకు బయలుదేరారు. పెరోల్‌పై ఆమె వ్యక్తిగత కారణాలను వినియోగించుకోవాలి.. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలపై చర్చలు జరపవద్దని నిబంధన విధించింది కోర్టు. కానీ ఆమె వాటిని అతిక్రమించినట్టు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఐదు రోజుల్లో శశికళ కేవలం రెండు రోజులు మాత్రమే ఆసుపత్రికి వెళ్లి తన భర్తను పరామర్శించిందట.  అక్కడ కూడా ఆమె ఐదు గంటల కంటే ఎక్కువ సేపు లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగతా సమయంలో పార్టీ కార్యకలాపాల్లోనే మునిగి ఉందని వార్తలు వచ్చాయి.  ఈ విషయంపై పరప్పన అగ్రహార జైలు పరిశీలించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి పెరోల్ మంజూరు అవ్వడం కష్టమే అంటున్నారు న్యాయ నిపుణులు.

SHARE