ఇక జోలికి రారు.. ఉమెన్ ఓన్లీ టాక్సీలు

మహిళలపై క్యాబ్ లలో జరుగుతున్న అఘాయిత్యాలు మనందరికీ తెలిసినవే. వాటిని అరికట్టడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. మహిళా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించే దిశగా బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌, కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ సహకారంతో మహిళల కోసం మహిళలే నడిపే ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను బీఐఏఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ హరిమరార్‌, కేఎస్ టీడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కుమార్‌ కుష్కర్‌లు పచ్చజెండా చూపి ప్రారంభించారు.

Telugu News bengaluru airport limited introduced women only taxis for women safety  

ఈ సందర్భంగా హరిమరార్‌ మాట్లాడుతూ… ‘పగటిపూట ఈ సేవలకు కి.మీ. రూ.21.50 చొప్పున, రాత్రివేళల్లో రూ.23.50 చొప్పున చార్జీలు వసూలు చేస్తాం. జీపీఎస్‌తోపాటు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ట్యాక్సీలు మహిళా ప్రయాణీకుల భద్రతకు పూర్తి భరోసా కల్పిస్తాయి. రానున్న రోజుల్లో ఈ ట్యాక్సీల సంఖ్యను మరింతగా పెంచుతాం. ఈ ట్యాక్సీలలో డ్రైవర్‌లుగా సేవలందించే మహిళలు హిందీ, ఆంగ్లభాషలతోపాటు అన్ని దక్షిణాది భాషలలో ప్రావీణ్యం కలిగి ఉంటారని’ తెలిపారు. తొలి రోజు నుంచే ఉమెన్‌ ఓన్లీ ట్యాక్సీలకు అనూహ్యస్పందన లభిస్తున్నది.Telugu News bengaluru airport limited introduced women only taxis for women safety