’బేటీ’ తెలంగాణ ప్రచారకర్తగా రకుల్ - MicTv.in - Telugu News
mictv telugu

’బేటీ’ తెలంగాణ ప్రచారకర్తగా రకుల్

October 11, 2017

ఆడపిల్ల ఎందులోనూ తక్కువ కాదు. ‘ మగాడు ఎక్కువ.. ఆడవాళ్ళు తక్కువ ’ అనే మాటకు ఎప్పుడో కాలం చెల్లింది. నరేంద్ర  ప్రధానమంత్రి అయ్యాక ఆడకూతురి ప్రాముఖ్యతను మరింత పెంచారు. ‘ బేటీ బచావో – బేటీ పడావో ’ పేర ఆడపిల్లల ఔన్యత్యాన్ని చాటుతున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా వర్థమాన సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైంది. బుధవారం జరిగే అంతర్ఝాతీయ బాలికల దినోత్సవాల్లో రకుల్ పాల్గొంటుంది. బేగంపేటలోని సెస్‌లో శిశు సంరక్షణాధికారుల సమక్షంలో జరిగే ఈ వేడుకల్లో విద్యార్థులకు క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రకుల్ ముఖ్యంగా ‘ బేటీ బచావో – బేటీ పడావో ’ ప్రాముఖ్యతను వివరిస్తుంది.