చిరంజీవిని చూస్తే బెటర్ అనిపించదూ మరీ - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవిని చూస్తే బెటర్ అనిపించదూ మరీ

March 31, 2018

సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ‘ రంగస్థలం ’ సినిమా విషయంలో కూడా తీవ్ర విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా తన ట్విటర్ వేదికగా పవన్‌ని టార్గెట్ చేశారు. అందుకొక పిట్టకథ చెప్పేసి పవన్ కన్నా చిరంజీవే బెటర్ అని ట్వీట్ చేశారు.ఆ పిట్టకథలో అన్న కన్నా తమ్ముడే పెద్ద ముదురన్నట్టు రాసుకొచ్చారు. ఒక వూరిలో ఒక వెధవ బ్రతికుండగా ఆడవాళ్ళను నానా హింసలు పెట్టేవాడని ఆ పిట్టకథ మొదలు పెట్టాడు. ‘ చచ్చేముందు తండ్రి కొడుకుతో.. బ్రతకడం ఇట్టా బతికేసాను. చచ్చాకైనా నాకు మంచిపేరు తీసుకురా అన్నాడట. కొడుకు తండ్రికన్నా దారుణాలు చేసి, వీడికన్నా వీడి తండ్రే బెటర్ అనిపించాడంట ’ అని రాసుకొచ్చాడు. చివరికి ఇప్పుడు చిరంజీవిని చూస్తే, బెటర్ అనిపించదూ మరీ అంటూ ముగించారు.