mictv telugu

వాలంటైన్స్ డే జరుపుకుంటే దాడులే.. భజరంగ్ దళ్

February 13, 2019

రేపే ఫిబ్రవరి 14, అనగా ప్రపంచ ప్రేమికుల దినోత్సవం. ఓ వైపు ఈ మధురమైన రోజును జరుపుకోవడానికి ప్రేమికులు సిద్ధం అవుతున్నారు. మరోవైపు వాలెంటైన్స్‌ డేను జరుపుకుంటే దాడులు తప్పబోవని భజరంగ్‌దళ్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. బుధవారం ఉదయం విశ్వ హిందూ పరిషత్‌ రాష్ట్ర కార్యాలయంలో భజరంగ్‌ దళ్‌ తెలంగాణ కన్వీనర్‌ సుభాష్‌ చందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో భాగం కాని ప్రేమికుల రోజును జరుపుకుంటే దాడులు తప్పబోవన్నారు. ఫిబ్రవరి 14 వ తేదీన వాలెంటైన్స్‌ పేరు చెబుతూ.. ప్రేమ జంటలెవరైనా బయట కనిపిస్తే, వారిని పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు.

Telugu News Beware lovebirds! Bajrang Dal to make videos of couples on Valentine s Day....

ప్రేమికుల రోజున పబ్‌‌లు, మాల్స్‌, హోటల్స్‌‌లో ప్రత్యేక కార్యక్రమాలు జరిపితే వారిపై దాడులు తప్పవని హెచ్చరించారు. రహదారులపై, పార్కులలో ప్రేమ జంటలు కనిపిస్తే వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. గురువారం అన్ని రహదారుల కూడళ్లలో వాలెంటైన్స్‌ దిష్టి బమ్మలను దహనం చేసి తమ నిరసనలను తెలుపనున్నామని, నల్ల జెండాలను ప్రదర్శిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో భజరంగ్‌ దళ్‌ నేతలు ముఖేశ్‌, శివరాములు జగదీశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.Telugu News Beware lovebirds! Bajrang Dal to make videos of couples on Valentine s Day