మెట్రో స్మార్ట్ కార్డుతో జర భద్రం…! - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో స్మార్ట్ కార్డుతో జర భద్రం…!

November 30, 2017

హైదరాబాద్ మెట్రో స్మార్ట్ కార్డు రైలులో  ప్రయాణించకపోయినా  స్మార్టుగా సొమ్మును కాజేస్తుంది సుమా. జర జాగ్రత్తగా వాడాలి దీన్ని. కొత్త మెట్రో రైటు, కొత్త స్టేషన్లను చూసి, సెల్ఫీలు దిగుదామనుకున్న వారికి టోకరా వేస్తుంది ఈ కార్డు. రైలు ఎక్కామా, దిగామా అన్నట్టే వుండాలి. ఎందుకంటే స్టేషన్ యావత్తు పెయిడ్ ఏరియా కిందకు వస్తుంది.ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్‌ నాగోల్‌ స్టేషన్‌లో బుధవారం రూ.200 చెల్లించి స్మార్ట్‌ కార్డు తీసుకున్నారు. ఇందులో రూ. 100 ప్రయాణం కోసం వాడుకోవచ్చు. అయితే రాజేష్‌కు పిల్లర్ల మీద కట్టిన కొత్త స్టేషన్లను చూడాలని బుద్ధి పుట్టింది. ఎంచక్కా స్టేషన్ మొత్తంగా గంట సేపు కలియదిరిగాడు. తీరిగ్గా బయటకు వచ్చి తన స్మార్ట్ కార్డులోని బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. బ్యాలెన్స్ రూ. 100 వుండాల్సింది రూ. 12 మాత్రమే వున్నాయి.

రైలు ఎక్కకుండానే రూ. 88 బ్యాలెన్స్ గోవిందా అయేసరికి రాజేష్ అవాక్కయ్యాడు. వెంటనే వెళ్ళి నిర్వాహకులను అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో, ఏమీ చేయలేక ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టాడు. రాజేష్ స్మార్ట్ కార్డు ఉదంతం తెలిసి చాలా మంది అలర్టయ్యారు. రైలులో ప్రయాణించకుండా స్టేషన్‌లో తిరిగి టైంపాస్ చేస్తామంటే కుదరదు. దానికి కూడా పెయిడ్ వుంటుంది మరి. కార్డు తీసుకొని స్టేషన్ లోపలికి వెళ్ళినప్పటి నుండే ప్మార్ట్ కార్డు దండన మొదలవుతుందన్నమాట.