తెలుగు  సినిమాతో భాగ్యశ్రీ రీఎంట్రీ ! - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు  సినిమాతో భాగ్యశ్రీ రీఎంట్రీ !

March 12, 2018

బాలీవుడ్‌లో 1989లో విడుదలైన  ‘మైనే ప్యార్ కియా’. ఈ సినిమా తెలుగులో ప్రేమ పావురాలు’  విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో నటించిన సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీలకు మంచి పేరు వచ్చింది.  ఈ సినిమాలో భాగ్యశ్రీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత భాగ్యశ్రీ ఒకటి ,రెండు తెలుగు సినిమాల్లో చేసిన  తనకు అంతగా కలిసి రాలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత భాగ్యశ్రీ మళ్లీ తెరపై కనిపించనుంది.చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం 2 స్టేట్స్ సినిమా తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో  అడివి శేష్‌, శివాని ​( జీవిత రాజశేఖర్‌ కుమార్తె) జంటగా నటించబోతున్నారు. హీరో తల్లి పాత్రకు భాగ్యశ్రీ అయితేనే న్యాయం చేస్తుందని చిత్రయూనిట్ అనుకున్నారట.