70 కోట్లబడ్జెట్‌తో మరో  ‘భక్త కన్నప్ప’ - MicTv.in - Telugu News
mictv telugu

70 కోట్లబడ్జెట్‌తో మరో  ‘భక్త కన్నప్ప’

February 6, 2018

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ‘భక్త కన్నప్ప’ఆయన కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్. 40 ఏళ్ల కిందట వచ్చిన ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. వాణిశ్రీ కథానాయికగా అలరించింది. అంతేకాక సత్యం అందించిన సంగీతం కూడా సినిమా హిట్ అవడానికి దోహదపడింది. అదే ‘భక్త కన్నప్ప’ కథకు నేటి ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో మళ్లీ వెండితెరకు ఎక్కిస్తున్నారు. ఈ సంగతిని హీరో మంచు విష్ణు ఇదివరకే చెప్పాడు. అయితే తర్వాత ఆ ఊసెత్తలేదు. దీంతో  ప్రాజెక్టును పక్కన పడేశారని భావించారు.

అయితే తాజాగా విష్ణు దీనిపై కొత్త కబురు తెచ్చాడు. రూ. 70 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నామని, కన్నప్పగా తానే నటిస్తున్నానని వెల్లడించాడు. దీనికి సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడని, ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేయనున్నారని తెలిపాడు. తనికెళ్ల భరణి  కథను సమకూరుస్తున్నాడని, దర్శకుడు ఎవరనే విషయం త్వరలో ప్రకటిస్తానని తెలిపాడు