ఉచిత విద్య కోసం రూ.7000 కోట్ల విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

ఉచిత విద్య కోసం రూ.7000 కోట్ల విరాళం

November 23, 2017

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ సంస్థ చైర్మన్ సునీల్ మిట్టల్ తమ గ్రూప్ దాతృత్వ సంస్థ భారతీ ఫౌండేషన్‌కు భారీగా విరాళం ఇచ్చారు. తమ కుటుంబం  సంపద  నుంచి రూ.7000 కోట్లను విరాళంగా అందించినున్నట్టు ప్రకటించారు.  ఈ మెత్తంలో భారతీ ఎయిర్ టెల్‌కు చెందిన 3శాతం వాటా కూడా ఉంది. వెనుకబడిన బలహీన వర్గాల యువతకు ఉచితంగా విద్యను అందించడానికి భారతీ కుటుంబం ,‘సత్యభారతీ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనున్నారు.ఈ కొత్త యూనివర్సిటీ  సైన్స్ టెక్నాలజీలపై పూర్తి  దృష్టి పెట్టనుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , రోబోటిక్స్ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈ యూనివర్సిటీ ఉత్తర భారత్‌లో 10 వేల మంది విద్యార్థులతో  2021 ప్రారంభం కానుంది.