ఎయిర్‌టెల్ హాట్ స్పాట్ రూ. 999కే - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్‌టెల్ హాట్ స్పాట్ రూ. 999కే

December 4, 2017

రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇవ్వడానికి  భారతీ ఎయిర్‌టెల్ తన 4జీ హాట్‌స్పాట్ డివైస్ ధరను 50 శాతానికి తగ్గించింది. దీని ధర రూ 1950కు లభిస్తుండగా, ప్రస్తుతం కేవలం రూ.999లకే లభిస్తోంది.  ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ పరికరానికి 10 డివైస్‌లను ఏక కాలంలో కనెక్ట్ చేసుకుని వైఫై సేవలను పొందొచ్చు.

ఇందులో 1500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దాంతో ఈ హాట్‌స్పాట్ పరికరం 6 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌  ఇస్తుంది. అంతేకాదు యూజర్ ఉన్న ప్రదేశంలో 4జీ అందుబాటులో లేకపోతే 3జీ  ద్వారా కూడా ఈ హాట్ స్పాట్ పని చేస్తుంది. దాంతో వినియోగదారులకు నిరంతంగా ఇంటర్నెట్ సేవలను పొందొచ్చు.