mictv telugu

మోదీ ప్రభుత్వానికి షాక్.. భారతరత్న వెనక్కి!

February 12, 2019

కేంద్రంలోని నరేంద్ర మోదీ  ప్రభుత్వం తీసుకొచ్చిన భారత పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ బిల్లుకు నిరసనగా ప్రముఖ మణిపూర్ దర్శకుడు అరిబం శ్యామ్ శర్మ తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి అస్సాంకు చెందిన ప్రఖ్యాత సంగీత కళాకారుడు దివంగత భూపేన్ హజారికా కుటుంబసభ్యులు చేరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఈ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు భూపేన్ హాజరికాకు గత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత రత్న పురస్కారాన్ని వెనక్కి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. కాగా, పురస్కారం వెనక్కి ఇవ్వడం వ్యవహారంలో వారి కుటుంబంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu News Bhupen Hazarika’s son His name used to push painfully unpopular bill

పురస్కారం వెనక్కి ఇవ్వడం చాలా పెద్ద విషయమని వారి కుటుంబంలో కొందరు సభ్యులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని హజారికా సోదరుడు సమర్ తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ నుంచి వలసవచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్దులు, పార్శీలు, జైన్లు, క్రైస్తవులు మేఘాలయ, మణిపూర్, అస్సాం రాష్ట్రాల్లో అక్రమంగా నివసిస్తున్నారు. ముస్లిమేతర వలసదారులైన వీరందరికీ భారతపౌరసత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తూ కేంద్రం భారతపౌరసత్వ బిల్లును తీసుకొని వచ్చింది. ఇటీవల అస్సాంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పౌరసత్వ బిల్లుని సమర్ధించారు.Telugu News Bhupen Hazarika’s son His name used to push painfully unpopular bill