భద్రాద్రిలో భారీ ఎన్‌కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

భద్రాద్రిలో భారీ ఎన్‌కౌంటర్

December 14, 2017

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇల్లందు – టేకులపల్లి అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున చండ్ర పుల్లారెడ్డి బాట దళం మరియు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈఎన్‌కౌంటర్లో ఎనిమిది మంది మావోలు  హతమయ్యారు. ఈ ప్రాంతంలో మావోలు ఉన్నారన్న సమాచారాన్ని అందుకున్న గ్రేహౌండ్స్ పోలీసు దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, వారికి మావోలు కంటబడ్డారు.. వారిని లొంగిపోవాలని పోలీసులు ఎంత హెచ్చరించినా వారు వినలేదు.మావోల వైపు నుంచి కాల్పులు మొదలుకావడంతో ఆత్మరక్షణకోసం కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ND అజ్ఞాత దళాలలో పని చేస్తున్న సభ్యులను అరెస్టులు చేస్తున్న తెలిసిందే. ఈ దళంలోని వారందరిపై ఇల్లందు, టేకులపల్లి,బోడు పోలీసు స్టేషన్లలో మర్డర్,ఎక్స్టార్షన్, హత్యా ప్రయత్నాలుకు సంబంధించి పలు కేసులున్నాయని  తెలిసింది. ఘటనా స్థలి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.