కత్తి కార్తీక లేని లోటు కనబడుతోంది ! - MicTv.in - Telugu News
mictv telugu

కత్తి కార్తీక లేని లోటు కనబడుతోంది !

August 28, 2017

బిగ్ బాస్ షో నుండి కత్తి కార్తీక ఎలిమినేటింగ్ ఆ షో ప్రేక్షకులకు మింగుడు పోవడం లేదు.  తొలి నుంచి కార్తీక తనికిచ్చిన టాస్కుల్లో పర్ఫెక్టుగా ఆడింది. హౌజ్ లో కూడా ఎవరి జోలికీ అస్సలు వెళ్ళేది కాదు. అందరితో చాలా హంబుల్ గా వుంది. షో చూస్తున్నవాళ్ళలో తప్పకుండా తనే గెలుస్తందనే ధీమా కలిగించింది. ఫోన్ ఎస్ఎమ్ఎస్ లతో అంటూ ఒక్కొక్కరినీ హౌజ్ నుండి ఎలిమినేట్ చేస్తున్నారు. అదెంతవరకు కరెక్టనే ప్రశ్నలు వినబడుతున్నాయి. ధన్ రాజ్, కార్తీకలు వెంట వెంటనే ఎలిమినేట్ అయ్యారు. హౌజ్ కంటెస్టెంట్స్ కి తెలంగాణ వంటలను పరిచయం చేసింది కార్తీక. అలాగే దీక్షతో ముద్దు ముద్దుగా తెలంగాణ స్లాంగ్ మాట్లాడించింది.

మొదటినుండీ కాస్త కాంట్రవర్సిగానే వుంటున్న అర్చనే ఎలిమినేట్ వేటుకు గురవుతుందనుకున్నారు. కానీ కార్తీకను ఎలిమినేట్ చేయడంతో షో కాస్త చప్పిడిగానే మారింది.  ఎందుకంటే కత్తి కార్తీకను అభిమానించేవాళ్ళు చాలా మంది వున్నారు. అభిమానించే సెలెబ్రిటీలు ఒక్కక్కరుగా వెళ్తుంటే షో చూస్తున్నవాళ్ళల్లో ఆసక్తి తగ్గుతోంది.  నవదీప్ ఎంట్రీ అయినప్పటినుండి షో పక్కదారి పట్టిందని అంటుననారు.. డబల్ మీనింగ్ మాటలు, వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయనే విమర్శలు వినబడుతున్నాయి. ఏదేమైనా కత్తి కార్తీక లేని లోటు కొట్టిచ్చినట్టు కనబడుతోంది ఆమెను అభిమానించేవారిలో.