హిందీలో ఎంతో ప్రాచుర్యం పొందిన టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్.. తెలుగులోకి ప్రవేశించి ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా… రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. అయితే రెండో సీజన్లో మాత్రం బాగా వివాదాస్పదమైంది. ఈసారి జరుగబోయే షోలో ఎలాంటి వివాదాలకూ… ఆరోపణలకు తావు లేకుండా ‘బిగ్‌బాస్’ యాజమాన్యం జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.బిగ్ బాస్-3 లో పాల్గొనే పార్టిసిపెంట్స్ లిస్ట్ ఒకటి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘రేణు దేశాయ్, గద్దె సిందూర, శోభిత ధూళిపాల, వరూణ్ సందేశ్, ఉదయ భాను, రఘు మాస్టర్, హేమచంద్ర, జబర్దస్త్ గణేశ్, టీవీ ఆర్టిస్ట్ జాకీ, చైతన్య కృష్ణ, మనోజ్ నందన్, కమల్ కామరాజు, నాగ పద్మిని, యూట్యూబ్ స్టార్ ‘మహాతల్లి’ ఫేమ్ జాహ్నవి’’ ఉన్నారు. అయితే, వీరంతా ఫైనల్‌గా ‘బిగ్‌బాస్ 3’లో ఉంటారా లేదంటే.. ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా వేరే వారిని తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.