సెలవు బిగ్‌బాస్… నాని ఎమోషనల్ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

సెలవు బిగ్‌బాస్… నాని ఎమోషనల్ ట్వీట్

September 30, 2018

‘బిగ్ బాస్’ సీజన్-2 ఈ రోజుతో ముగియనుంది. ఈ కార్యక్రమంతో చాలా మంది అభిమానులు కనెక్ట్ అయి వున్నారు. చూస్తున్నవారికే ఇంత అభిమానం వుంటే అందులో పాటిస్పైట్ చేసినవారికి ఎంత అటాచ్‌మెంట్ వుంటుందో కదా? ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాని కూడా చాలా గొప్ప అనుభూతిని పొందినట్టు తన ట్విటర్ ద్వారా తెలిపాడు.

ఈరోజే ఫైనల్ అని, వ్యాఖ్యాతగా తన చివరి రోజని పేర్కొన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా ఓ అద్భుతమైన అనుభూతిని పొందానని, ఎంతో నేర్చుకున్నానని, ఇంకెంతో  నేర్చుకోలేదని చెప్పాడు నాని. ఇంతగా జనాదరణ పొందిన షోకు తాను వ్యాఖ్యాతగా వ్యవహరించినందుకు బిగ్‌బాస్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను అన్నాడు. యాంకర్‌గా తనని ఇష్టపడనివాళ్ళు థియేటర్లో కలుస్తారని… బిగ్‌బాస్‌కు సెలవు అని తన పోస్టులో పేర్కొన్నాడు.