ఈ ముగ్గురిలో మూడో బిగ్‌బాస్ ఎవరు ? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ముగ్గురిలో మూడో బిగ్‌బాస్ ఎవరు ?

October 3, 2018

బిగ్‌బాస్ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకు రుచిస్తుందా లేదా అనే అనుమానాల మధ్య వచ్చింది. అనుమానలను తారుమారు చేస్తూ అనతికాలంలోనే అత్యంత ప్రేక్షకాదరణ పొందింది ఈ రియాలిటీ షో. సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. 13 మంది కంటెస్టెంట్స్, 70 రోజులు హౌజ్‌లో వున్నారు. చివరికి శివబాలాజీ బిగ్‌బాస్ సీజన్1 విజేతగా నిలిచాడు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్2 మొదలైంది. 18మంది కంటెస్టెంట్లతో, 113 రోజుల పాటు సాగింది. చివరికి సీజన్2 విన్నర్‌గా కౌశల్ నిలిచాడు. రెండు సీజన్లు అయిపోయాయి. మరి తర్వాతి మూడో సీజన్ ఎప్పుడా అని ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఎదరుచూస్తున్నారు.

Who is the third Biggas of the three

సీజన్ మూడుకి మళ్ళీ జూనియర్ ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. కానీ అవన్నీ వదంతులే అని తేలింది. తాజగా సీజన్ 3కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వినబడుతోంది. సీజన్ 3కి అల్లు అర్జున్, రానా, విజయ్ దేవరకొండ ముగ్గురిలో ఏ ఒక్కరో హోస్ట్ చేస్తారని సమాచారం. ప్రేక్షకుల్లో ఈ షోకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా త్వరలోనే మూడో సీజన్‌ను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. హోస్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు బిగ్‌బాస్ టీం. రానా ఇదివరకే ఓ టీవీ ఛానల్‌కి ప్రోగ్రాం చేశాడు. అల్లు అర్జున్ ఇంతవరకు ఎలాంటి టీవీ కార్యక్రమాలను హోస్ట్ చేయలేదు. ఇక విజయ్ కూడా ఎలాంటి టీవీ షోలు చెయ్యలేదు. ముగ్గురికీ యూత్‌లో మంచి క్రేజ్ వుంది. ముగ్గురిలో ఎవరు హోస్ట్‌గా చేసినా ప్రోగ్రాం ఒక లెవల్లో వుంటుందని భావిస్తున్నారట. చూడాలి మరి స్టార్ యాజమాన్యం ఎవరిని ఫైనలైజ్ చేస్తుందో.