బిహార్ మావోయిస్టు కమాండర్ సందీప్ యాదవ్ అలియాస్ బడ్కా భయ్యాకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. అతివాద వామపక్ష నేత ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం దేశంలో ఇదే తొలిసారి. సందీప్ యాదవ్ కుటుంబానికి చెందిన రూ. 86 లక్షల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలిచ్చింది.
ప్రస్తుతం యాదవ్ బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు స్పెషల్ ఏరియా కమిటీ ‘మధ్య జోన్’ ఇన్ ఛార్జిగా ఉన్నాడు. బిహార్లోని 5 ప్లాట్లను ఢిల్లీలోని ఒక ఫ్లాట్ కొనుగోలు సంబంధించిన రూ. 10.43 లక్షలు నగదు, కొన్ని వాహనాలు,బ్యాంకు డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద వీటిని క్రయవిక్రయాలను అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు.
బిహార్ కు చెందిన పలువురు మావోయిస్టు నేతలకు కోట్లకొద్దీ విలువైన ఆస్తులు ఉన్నట్లు ఇటీవల పోలీసులు చెప్పండం తెలిసిందే. వారి పిల్లలు ఖరీదైన కార్లలో తిరుగుతూ కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నారని వెల్లడించారు