ఛీఛీ.. ఉపాధ్యాయులతో ఇదేం పని? - MicTv.in - Telugu News
mictv telugu

ఛీఛీ.. ఉపాధ్యాయులతో ఇదేం పని?

November 22, 2017

బిహర్ ప్రభుత్వం టీచర్లుకు ఇచ్చిన పనిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన నిర్మూలన ప్రచారంలో  భాగంగా బహిరంగ మల విసర్జన చేసే ప్రజల ఫోటోలను తీయాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఓ టాస్క్ ఇచ్చింది. దాని కోసం గురువులు ఉదయం 5 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ట్యాబ్ పట్టుకుని తిరగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కృష్ణ నందన్  ప్రసాద్  తెలిపారు. దీనివల్ల టీచర్ల  బోధ సమయం వృథా కాదని, రోజూ కొద్ది సేపు  ప్రజలకు అవగాహన కలిగించడానికి ఈ షెడ్యూలు ప్రకటించామని చెప్పుకొచ్చారు.దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్లు బహిరంగ విసర్జన ఫోటోలు తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది టీచర్లును అవమానించే విధంగా ఉందని నితీశ్ ప్రభుత్వంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన జనాభా లెక్కలు, ఓటరు లిస్టు వంటి భోధనేతర పనులతో ప్రభుత్వం ఉపాధ్యాయులకు పనిభారం ఎక్కువైందని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బిహర్ ప్రభుత్వం ఆలోచనను విద్యావేత్తలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు.