పాపం బీహార్ కుర్రాళ్లు..! - MicTv.in - Telugu News
mictv telugu

పాపం బీహార్ కుర్రాళ్లు..!

February 5, 2018

బీహార్ రాష్ట్రంలో పెండ్లికాని కుర్రాళ్లందరూ ఇంట్లకేలి కాలు బయట పెట్టాలంటే గజ గజ వణికి పోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడనుంచి  ఎవడు వచ్చి కిడ్నాప్ చేస్తాడో అని. ఇంతకీ కిడ్నాప్ చేసేది ఎందుకు డబ్బుల కోసమా అను అనుకునెరు. కాదు లగ్గం చేయనీకి. బీహార్ లో ఈమధ్య బలవంతపు పెండ్లిళ్లు ఎక్కువయ్యాయి.  యువకులను ఎత్తుకుపోయి మరీ  తలపై గన్ పెట్టి  బలవంతపు పెండ్లిళ్లు చేస్తున్నారు. పిల్ల నచ్చకపోయినా ఏడ్సుకుంటూ పిలగాడు పిల్ల మెడలో తాళి కడుతున్నాడు. 2017 లో మొత్తం 3400 బలవంతపు పెళ్లిళ్లు బీహార్లో జరిగాయి. ఇలా బలవంతంగా పెళ్లి చేయడాన్ని  బిహార్‌లో ‘పకడ్వా వివాహ్‌’ అని పిలుస్తారు. మరి ఎందుకిలా చేస్తున్నారు అంటే.  కూతురికి కట్నాలు ఇచ్చి పెండ్లి చేసే స్థోమత లేని తల్లిదండ్రులు ఇలా  యువకులను ఎత్తుకు వచ్చి  బలవంతంగా  తాళి కట్టిస్తున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2015 లెక్కల ప్రకారం 18 ఏళ్లకుపైగా వయసున్న అబ్బాయిలను ఎత్తుకుపోవడంలో  దేశంలోనే బిహార్‌ మొదటి స్థానంలో ఉంది. వచ్చే పెళ్లిళ్ల సీజన్‌లో ‘పకడ్వా వివాహ్‌’లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. బీహార్లో పెండ్లి కాని యువకులు మాత్రం  ఒంటరిగా బయటకు వెళ్లడమే మానేసారట. ఎక్కడ ఎత్తుకు వెళ్లి బలవంతపు పెండ్లి చేస్తారో అని.