శబ్దకాలుష్యం నుంచి కాపాడలేందని విడాకులు..! - MicTv.in - Telugu News
mictv telugu

శబ్దకాలుష్యం నుంచి కాపాడలేందని విడాకులు..!

March 27, 2018

భర్త శబ్దకాలుష్యం  నుంచి తనను కాపాడలేదంటూ  ఓ భార్య విడాకులు ఇచ్చేందుకు డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుంటోంది. బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో ఈ గొడవ రేగింది.  హజిపూర్‌కు చెందిన స్నేహా సింగ్‌కు నాలుగేళ్ల క్రితం మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ రాకేశ్ శర్మతో పెళ్లయింది. వాళ్లు నివసిస్తున్న ఇంటి సమీపంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి.  రోజు భారీ శబ్దంతో లౌడ్ స్పీకర్లతో ప్రార్థలను వినిపిస్తుంటారు.

చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్నేహ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ సమస్యకు పరిష్కారం కాలేదు. దాంతో విసుగెత్తిన స్నేహ.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీలకు కూడా లేఖలను రాసింది. అయినా ఫలితం లేకపోయింది. దీంతో విరక్తి చెందిన స్నేహ  తన భర్త నుంచి విడాకులు కోరుతూ దరఖాస్తు చేసింది. ధ్వని కాలుష్యం గురించి భర్తకు నెత్తీనోరూ కొట్టుకుని వివరించినా పట్టించుకోలేదని, తనకు భద్రత కల్పించని వ్యక్తితో జీవించలేనని విడాకుల పత్రంలో పేర్కొంది.

మైక్‌లను తీసివేయాలని కోరినా, ఎవరూ స్పందించడం లేదని, అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారని భర్త రాకేశ్ తన నిస్సహాయత వ్యక్తం చేశాడు. కానీ స్నేహి మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేసింది. పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది.