మోదీ తాట తీస్తా: లాలూ కొడుకు - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ తాట తీస్తా: లాలూ కొడుకు

November 27, 2017

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీపై  ఆర్జేడి ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి,  ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించడంపై తేజ్ మండిపడ్డాడు.  ‘లాలూను చంపడానికి కుట్ర జరుగుతున్నది. మేం చూస్తూ  ఊరుకోం..  మోదీ తోలు వలుస్తాం… ’ అని  తేజ్ ప్రతాప్ తీవ్రంగా హెచ్చరించారు. అసెంబ్లీ పరిసరాల్లోనే తేజ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో  బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధానిని అవమానించిన తేజ్ ప్రతాప్‌పై చర్యలు తీసుకోవాలని  అధికార పార్టీ జేడీయూ సభ్యులు డిమాండ్ చేశారు.

లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈ నెల 23న  జడ్ క్యాటగిరీ సెక్యూరిటీ తగ్గించారు. లాలూతో పాటు బీహర్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ, శరత్ యాదవ్‌లకు కూడా భద్రత తగ్గించారు. దీనిపై ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు.