గుడ్డివెలుతురులో సర్జరీ.. మేరా భారత్.. వర్ధిల్లు! - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్డివెలుతురులో సర్జరీ.. మేరా భారత్.. వర్ధిల్లు!

March 19, 2018

దేశ అభివృద్ధి మహాభారతంలో ఎక్కడో తేడా కొడుతోంది. చంద్రుడిపైకి, అంగారకుడిపైకి రాకెట్లు పంపుతున్న దేశం ప్రజల కనీస అవసరాలు తీర్చడంతో అధ:పాతాళానికి దిగ జారిపోతోంది. బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో ఒక మహిళలకు టార్చిలైటు వెలుగులో ఆపరేషన్ చేసి పడేశారు..! సహర్సా జిల్లాలోని సదుర్ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది.

చాలా ఆస్పత్రుల్లాగే ఇందులోనూ జనరేటర్ లేదు. కరెంటుపోతే  కొవ్వొత్తులు, సెల్ ఫోన్లు, టార్చిలైట్లే గతి. పెద్ద ఆపరేషన్ అయినా చిన్న ఆపరేషన్ అయినా థియేటర్‌లోకి వెళ్లి రోగికి పరిస్థితి క్షణక్షణమొక గండమే. దీనికి తోడు సర్జరీ చేస్తున్న డాక్టరు వేసుకోవడానికి ఆకుపచ్చ డ్రస్సు కూడా గతిలేదంట. అందుకే సదరు వైద్యో నారాయణో హరిగారు ఖాకీ చొక్కా వేసుకుని పని కానిచ్చేశాడు. ఆ గుడ్డి వెలుతురులో కుట్లు వేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్, యూపీ తదితర రాష్ట్రాల్లో ఈ చీకటి ఆపరేషన్లు మామూలేనంట.