జారుడుబండ.. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ - MicTv.in - Telugu News
mictv telugu

జారుడుబండ.. తెలుగుతల్లి ఫ్లై ఓవర్

March 16, 2018

హైదరాబాద్‌‌లోని  తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై  భూకంపం వచ్చినంత పనైంది. శుక్రవారం ఉదం  బైకులపై వెళుతున్న వారంతా ఒక్కసారిగా టపా టపా అని కింద కూలారు. వాళ్లందరికి డ్రైవింగ్ రాదేమో అనుకునెరు.

కాదు…  పొద్దున కురిసిన వానకు .. బండ్లు స్కిడ్ అయ్యాయి. వాహనాలు నిత్యం వెళుతుండడంతో రోడ్లపై ఆయిల్ లీక్ అవుతూ ఉంటుంది. ఈ రోజు  ఉదయం వర్షం పడడంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ జారుడు బండగా మారింది. దాదాపు 20 బైకుల దాకా స్కిడ్ అయ్యాయి.

చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయి. దీనితో అప్రమత్తమైన పోలీసులు కొద్దిసేపు  తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పైకి వాహనాలను అనుమతించలేదు. ఆ తర్వాత వర్షపు నీరు ఎండిపోవడంతో పరిస్థితి ఎప్పటిలాగే మారింది.